కల్తీకల్లు తాగి ఒకరు మృతి

ఆదిలాబాద్‌: కల్తీకల్లు కాటుకు ఓ నిండు ప్రాణం బలైంది. భీమిని మండలం కుమ్మరగూడెంలో కల్తీల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.