కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థత

మెదక్‌: తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీకల్లు  కలకలం సృష్టించింది. మంగళవారం కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి స్సృహ తప్పి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాళ్లకల్‌ లో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మేడ్చల్‌, కొంపల్లి ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.