కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
హైదరాబాద్, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని టీటీడీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు.
అవినీతి ఓ సమస్యే కాదని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, సమాజం ముఖ్యమని చంద్రబాబు అన్నారు.