కళలు మానవుని జీవితంలో సున్నితమైన అనుభూతులను తట్టి లేపి జాగృతం చేస్తాయి
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) సెప్టెంబర్ 26:
జిల్లాస్థాయి కళా ఉత్సవాలను సిద్దిపేట పట్టణంలోని స్థానిక ఉపాధ్యాయ శిక్షణ భవనములో జిల్లా విద్యాశాఖాధికారి రవికాంత్ రావు గురువారం నాడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, గాత్రం, వాద్యసంగీతం మొదలగు అంశాలలో రాణించాలని ఆకాంక్షించారు. తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాలుగు అంశాలలో ఉత్సవ పోటీలను ప్రారంభిస్తూ కలల ద్వారానే సున్నితమైన అంశాలను తెలుసుకోగలుగుతారు అని కలలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో వివిధ పాఠశాలలు మరియు కళాశాలలు సుమారు 50 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమమైన ప్రతిభను చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో జరిగే ఉత్సవం పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన వారిలో
1. గాత్ర సంగీతం విభాగంలో సత్య సాయి జూనియర్ కళాశాల కొండపాకకు చెందిన మైత్రేయి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేటకు చెందిన ఎం మహేష్ ఎంపికయ్యారు.
2. చిత్రలేఖనం విభాగంలో కొండపాకకు చెందిన ఎం. ఆర్పిత, పాఠశాలకు చెందిన ఆర్.మధుసూదన్ లు ఎంపికయ్యారు.
3. వాద్య సంగీతం విభాగంలో శ్రీ చైతన్య పాఠశాల సిద్దిపేటకు చెందిన ఆర్.మాదవ్, సత్య సాయి జూనియర్ కళాశాల కొండపాక చెందిన ఎస్. వర్ష ఎంపికయ్యారు.
4. నాట్య పోటీలలో కూల్ కొండపాక కు చెందిన ఎం జ్యోతి ఎంపికవ్వడం జరిగింది.
అందరూ రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవాల పోటీలకు సిద్దిపేట జిల్లాకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది.
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారి డాక్టర్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ…అనాది కాలం నుంచి కలలు మానవ జీవితంలో విడదీయరాని భాగం అని పేర్కొన్నారు. కళ్ళతోనే మనిషి తనను తాను పరిశీలించుకుని తన యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా డాక్టర్ సిద్దెంకి యాదగిరి. ఎండి నజీర్, మురళి, చంద్రశేఖర్, కోదండరామ శర్మ, యాదగిరి, ఫక్రుద్దీన్. శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.



