కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం.

డా రసమయి బాలకిషన్.
బెజ్జంకి,సెప్టెంబర్ 30,(జనంసాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి,గాగిల్లపూర్,బెజ్జంకి ఎక్స్ రోడ్,దాచారం,ముత్తన్నపేట,బెజ్జంకి,పోతారం గ్రామాల్లో శుక్రవారం కళ్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పంపిణీ చేశారు.ఆనంతరం డా.రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని అన్నారు.తల్లిదండ్రులు ఆడబిడ్డల పెళ్లి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకొని కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలతో పెళ్లిళ్లకు అండగా ఉంటూ పేద వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత తెరాస దక్కిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే గొప్ప పథకాలు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత తిరుపతి,మండల కో ఆప్షన్ సభ్యులు,తెరాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,ఎఎంసి చైర్మన్ కచ్చు రాజయ్య,తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,లింగాల లక్ష్మణ్,సర్పంచ్ లు బోయినపల్లి నర్సింగ రావు,అన్నాడి సత్యనారయణ రెడ్డి,టేకు తిరుపతి,పెంటమీది శ్రీనివాస్,కనగండ్ల రాజేశం,జేరిపోతుల రజిత తిరుపతి,ఎంపీటీసీ లు నల్లగొండ లక్ష్మీ నర్సయ్య,దుంబాల రాజా మహేందర్ రెడ్డి,కోమిరే మల్లేశం,ఏఏంసి వైస్ చైర్మన్ హమ్మండ్ల లక్ష్మారెడ్డి,తెరాస సోషల్ మీడియా ఇంఛార్జి ఎల శేఖర్ బాబు,తెరాస మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టలు దీటి రాజు,మాచం శ్రీనివాస్,దీటి బాల నర్సు,నాయకులు వంగల నరేష్,మేకల శ్రీకాంత్,బిగుల్ల మోహన్,జంగిటి శంకర్,మాచం బాబు,అర్జున్,మహేశ్,శేఖర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు