కవితక్క పై చేసిన అసత్య ప్రచారాలను ఖండించిన ఏర్గట్ల తెరాస పార్టీ

ఏర్గట్ల ఆగస్టు 23 (జనంసాక్షి ) : మునుగోడు సభ విజయవంతమైన వైనం చూసి ఓర్వలేక, భాజపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కవితక్క పై అవాస్తవ వార్తలు సృష్టించడాన్ని ఏర్గట్ల మండల తెరాస అధ్యక్షులు ఎనుగందుల రాజా పూర్ణనందం,ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఎంపీటీసీ మధు, మంగళవారం మండల కేంద్రంలోని తెరాస కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో  తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితక్క పై వచ్చిన ఆరోపణలు నిజమైతే బిజెపి ప్రభుత్వం చట్టపరమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలి కానీ, అసత్య ఆరోపణలతో గౌరవ ఎంఎల్సి కవితక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం నీతిమాలిన చర్యగా దీన్ని సాకుగా చూయిస్తూ బిజెపి గుండాలు హైదరాబాదులోని కవితక్క ఇంటిపై దాడి చేయడం అనాగరిక, పిరికిపంద చర్య, నీతిమాలిన చర్య అంటూ అభివర్ణించారు. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలనే కుటిల బుద్ధితో తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకత్వం అబద్ధపు ప్రచారాలతో అధికారం అందలం ఎక్కాలన్న పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి అన్నారు. మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం అయితే టిఆర్ఎస్ పార్టీ తరపున గ్రామ గ్రామం నుండి ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టి బిజెపి పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు గుల్లే లావణ్య గంగాధర్, భాను ప్రసాద్, పత్తి రెడ్డి ప్రకాష్ రెడ్డి, గద్దె రాధా గంగారం, సీనియర్ నాయకులు నేరెళ్ల లింగారెడ్డి, ఓర్సు రాములు రాంపల్లి మురళి, సింగసారం  గంగారం, బద్ధం శ్రీనివాస్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు బద్దం ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సున్నపు అంజయ్య, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు నాగులపల్లి అంజిరెడ్డి, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు