కవిూషన్ల కోసమే రీ డిజైనింగ్ : కాంగ్రెస్
ఆదిలాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): దారుణ కరవు పరిస్థితులు దాపురించినా జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించకపోవడం హాస్యాస్పదంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతులు సాగుచేసిన పంటలకు నీరందక ఆర్థికంగా కుంగిపోయారని, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. జలాశయాల రీడిజైన్ పేరుతో మార్చడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అసెంబ్లీలో నిబంధనలకు విరుద్దంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కవిూషన్ల కోసమే తెరాస సర్కారు రీడిజైనింగ్ చేస్తోందని విమర్శించారు. రాష్టాన్న్రి అప్పుల రాష్ట్రంగా మార్చి ఆ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలను ఆ రాష్టాన్రికి ప్రభుత్వం తాకట్టుపెట్టిందన్నారు. దాదాపు 25 శాతం తక్కువకు గుత్తేదారులు పనులు చేజిక్కుంచుకొని వాటికి గదుల్లో కూర్చొని ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. స్వార్థం కోసం, అన్నదమ్ములకు కాంట్రాక్టు పనులు ఇప్పించడానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారని విమర్శించారు. అన్యాయాలను అరికట్టేందుకు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు చేసి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని నెరవేర్చేవరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఒక్క పేదవాడికి
ఇల్లు కట్టించలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమికి కూడా ఇవ్వలేదన్నారు.