కశ్మీర్‌ను అల్లకల్లోలం సష్టించండి
– భారత్‌పై మరోసారి విషం కక్కిన హఫీజ్ సయీద్
లాహోర్, జూన్25(జనం సాక్షి ) : ముంబై పేలుళ్ల సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్ మరోసారి బహిరంగంగా భారత్‌పై విషం కక్కాడు. హింసాత్మక దాడులతో కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలంటూ ముష్కరమూకలకు పిలుపునిచ్చాడు. లా¬ర్‌లోని గడాఫీ స్టేడియంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త శకం ప్రారంభమైంది.. దేవుడి దయతో కాశ్మీర్ స్వతంత్ర దేశంగా అవతరించనుందన్నారు. కశ్మీర్‌లో రక్తం పారుతోందని, దేవుడు చూస్తున్నాడని, ఆయన త్వరలోనే తీర్పు చెబుతాడన్నాడు. ఎందుకంటే నిర్ణయాలన్నీ పైనుంచే వస్తాయి.. వాషింగ్టన్ నుంచి కాదు. కశ్మీర్‌కు స్వాతంత్యం రావడం ప్రపంచం కళ్లారా చూస్తుంది… భారత భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్నవాళ్లను ‘అల్లా’ చూస్తున్నాడు. వాళ్లు చనిపోతూ కూడా పాకిస్తాన్, కశ్మీర్ ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. కశ్మీర్‌లో ఇది నూతన శకం. మోదీ దీన్ని అడ్డుకోలేడు…’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో జరుగుతున్న ఉగ్రదాడుల్లో ఎక్కువగా సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబా చేస్తున్నవే కావడం గమనార్హం. భద్రతా దళాలపై రాళ్లు రువ్వేలా స్థానిక యువతను ఉసిగొల్పుతున్నది కూడా లష్కరే తోయిబానే. ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్న నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.