కష్టపడి చదువుకున్నాం

3

ఉపాధ్యాయుడిగా ప్రణబ్‌ పాఠాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జనంసాక్షి): గురుపూజోత్సవాన్ని పురస్కరిం చుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉపాధ్యాయుడిగా మారారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 11, 12వ తరగతి విద్యార్థులకు ‘భారత రాజకీయ చరిత్ర’పై పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో చిలిపి పనులు చేసేవాడినని… తన తల్లి వారించేదని చెప్పారు. ఎప్పుడూ కష్టపడి పనిచేయాలని తన తల్లి హితబోధచేసేదని వివరించారు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన సాధారణ విద్యార్థినని, ప్రతిరోజు 5 కి.విూ నడిచి స్కూల్‌కు వెళ్లే వాడినని ప్రణబ్‌ వివరించారు. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడి ముందుకు రావాలని అన్నారు. లక్ష్యం ఉంటేనే ప్రతి ఒక్కరూ రాణిస్తారని అన్నారు.