కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను తనిఖీ చేసిన అధికారులు
ఖానాపురం సెప్టెంబర్ 19జనం సాక్షి
మండలంలోని అశోక్ నగర్ గ్రామం లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను సోమవారం అకడమిక్ మానిటరింగ్ అధికారి సారయ్య , ప్లానింగ్ కో ఆర్డినేటర్ సుధీర్ బాబు మండల విద్యాధికారి రత్నమాల తో కలిసి సందర్శించారు.కిచెన్ షెడ్ తో పాటు పాఠశాల పరిసరాల్ని పరిశీలించారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.భోజన క్వాలిటీ,రుచి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు.విద్యార్థులు చురుకుగా సమాధానం చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాల లోని మౌలిక సదుపాయాలు,సివిల్ వర్క్స్ వివరాల్ని నమోదు చేసుకున్నారు.ఉపాధ్యాయులు అబాస్ మిషన్ లో ప్రతి రోజూ బయో మెట్రిక్ హాజరు వివరాల్ని పరిశీలించారు.అధికారుల సందర్శన సమయంలో చిల్డ్ లైన్ సదస్సు జరుగుతున్నందున సదస్సును ఉద్దేశించి ఏ.ఎం.ఓ సారయ్య మాట్లాడారు. విద్యార్థులు తమని ఇబ్బంది కలిగించే వ్యక్తుల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండి ఇబ్బంది అనిపిస్తే పెద్దలకి లేదా చైల్డ్ లైన్ నంబర్ 1098 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.చైల్డ్ ఇన్ఫో లో గాప్ లేకుండా విద్యార్థులందరూ వివరాలని నమోదు చేయాలని సూచించారు.ఉపాద్యాయులు టి.ఎల్.ఎం మెయింటైన్ చేయాలన్నారు.అకడమిక్ వ్యవహారాలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు.
3 Attachments • Scanned by Gmail