కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేసిన

సర్పంచ్ స్వామి గౌడ్.

కొమురవెల్లి  జనం సాక్షి : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ఆదివారం వాలీబాల్ కిట్ ని అందజేశారు రాసులాబాద్  సర్పంచ్ స్వామి గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు  క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే వారికి క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో
టిఆర్ఎస్ నాయకులు ఏ మహేష్, పాఠశాల ఉపాధ్యాయులు మంజుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు