కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు..
` అధికారంలోకి ఎలా వస్తారు..!?
` తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢల్లీి, గుజరాత్ గులాముల మధ్య పోటీ
` 40చోట్ల అభ్యర్థుల్లేని ‘హస్తం’పార్టీ.. 70చోట్ల గెలుస్తుందా?
` వంద నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారు
` పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరుతానంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తా
` బీజేపీ నేతలకే సీరియస్ లేదు.. 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతారు
` మీడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణలో దాదాపు సగం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థుల్లేరు.. అలాంటి పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో డబ్బులున్న వారికే టికెట్లు దక్కుతున్నాయని విమర్శించారు. కూకట్‌పల్లి సీటు కోసం రూ. 15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. నేను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోంది. ఇప్పటికే రూ. 8 కోట్లు కొడంగల్ చేరినట్టు సమాచారం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మీడియాతో శుక్రవారం ఏర్పాటు చేసిన చిట్‌చాట్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పలు విషయాలు వెల్లడిరచారు. మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు,పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేయనున్నట్లు కేటీఆర్ వెల్లడిరచారు.
హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి):సీఎం కేసీఆర్ వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, సిరిసిల్ల, కామారెడ్డిలో నేను ప్రచారం చేస్తానని, ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నానని తెలిపారు. అధికారుల బదిలీలను సాధారణ బదిలీలుగానే చూస్తాం. హుజురాబాద్‌లో కూడా మేమే గెలుస్తాం. ఈటల రాజేందర్ 50 చోట్ల పోటీ చేసినా, షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ అని కేటీఆర్ విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరుతానంటే రేపే వెళ్లి ఆహ్వానిస్తాను. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్‌లో తన్నుకుంటారు. కాంగ్రెస్‌లో సీఎం పదవికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉందన్నారు.అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని వారి నాయకత్వమే సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుంది. బీజేపీతో స్నేహముంటే మోదీని ఎందుకు తిడుతాం. మేం ప్రతీకార రాజకీయాలు చేయడం లేదు. రేవంత్ అక్రమాలపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి చెప్పగలరా..?
బీఆర్‌ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, కాంగ్రెస్, బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారని.. పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వస్తానని అంటే వారి ఇంటికి వెళతానని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రాసింది చదివే రీడర్ మాత్రమేనని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటదని.. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు పెండిరగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. గ్రేటర్‌లో 20 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరని అన్నారు.
కొడంగల్‌కు చేరిక రూ.8కోట్లు?
తాజాగా కర్ణాటకలో రూ.42 కోట్లు దొరికాయని, తమకు ఉన్న సమాచారం ప్రకారం 8 కోట్లు కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి అందాయని కేటీఆర్ ఆరోపించారు. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను అంగట్లో సరుకుల కొనాలని కాంగ్రెస్ అనుకుంటుందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. మైనార్టీలు తమ వైపే ఉన్నారని.. మైనార్టీల కోసం తాము 9 ఏళ్లుగా పని చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 286 మైనార్టీ హాస్టల్‌లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు లేవని, మిషనరీల పై దాడులు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ మోడీ, షాలను దేశంలో ఏ నేతను కూడా కేసీఆర్ విమర్శించలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ప్రభల శక్తిగా ఎదగాలని తమ ఆలోచనని.. బీజేపీ, కాంగ్రెస్ తో తమకెందుకని అన్నారు. తమ పైనే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నేతల మీద ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు? ఓటుకు నోటు కేసును కేంద్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఈసీ బదిలీలను, బదిలీలుగా మాత్రమే చూస్తామన్నారు. మరోవైపు తమకు 85 కంటే సీట్లు తగ్గవని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. 2018 మేనిఫేస్టోలోని 95 శాతం హామీలు అమలు చేశామని, కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయామన్నారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని, గజ్వేల్‌లో ఈటల పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు. ఇక, వైఎస్ షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్‌ఎస్‌లో చేరుతారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీలో ముఖ్యమంత్రి పదవికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉందని వివరించారు.
లోకేష్ ట్వీట్‌తో బాధేసింది..
చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ తెలిపారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకూ ఆందోళన కలిగిందని గుర్తుచేశారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.