కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలే..
` కర్ణాటకలో ఆ పార్టీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు
` వ్యవసాయానికి చాలీచాలని కరెంటుతో రైతుల అవస్థలు
` ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో
` సబ్‌స్టేషన్‌లో మొసలిని వదలడంపై వ్యగ్యంగా కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్(జనంసాక్షి): కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న కర్నాటక అధికారులపై ఆగ్రహంతో రైతన్నలు ఏకంగా సబ్‌స్టేషన్‌కు మొసలిని పట్టుకొచ్చారు. మాకు కరెంటు ఇస్తారా? మొసలిని సబ్‌స్టేషన్‌లో వదలాలా అంటూ నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌విూడియాలో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రమంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ సెటైర్ వేశారు. కరెంటు కష్టాలపై మంత్రి కేటీఆర్ చేసిన రీట్వీట్‌పై జనాలు కూడా భారీగా స్పందిస్తున్నారు. ఇదిలావుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి గద్వాల జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఐదు హావిూలు ఇచ్చి వాటిని అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడిపోయిందన్నారు. ప్రస్తుతం ఆరు హావిూలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడానికి వస్తుందని, వారు చెప్పే ఆరు హావిూలు ఆరు నెలలు కూడా అమలులో ఉండవన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులతో పాటు ప్రజలకు గోస తప్పదని హెచ్చరించారు. కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నా, రైతులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వం 12 గంటల కరెంటు ఇస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వక పోవడం వల్ల తమ పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.