కాంగ్రెస్‌కు ఓటేస్తే 24గంటల కరెంట్‌కు కటకటే

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు

ప్రజలను హెచ్చరించిన మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తెలంగాణ రాజకీయాల్లో కుట్కరలు చేస్తున్నారని, ఆయన కుట్రలో కాంగ్రెస్‌ పార్టీ బందీ అయిందని రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటేస్తే 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ ఆగిపోంతుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలన్నారు. పలువురు వివిధ పార్టీలకు చెందిన వారు మంత్రిని కలిసి మద్దతు తెలుపుతూ పార్టీల చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి ఓటేస్తే 2014కు ముందు నాటి చీకటి ర ఓజులను కొనితెచ్చుకోవడమే అవుతుందని అన్నారు. అలాగే ఆనాటి పరిణామాలే పునరావృతమవుతాయని మంత్రి అన్నారు. మనపై ఢిల్లీ పెత్తనమేంటంటూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపీ ఇప్పుడు వారితోనే జతకట్టడం దారుణమైన విషయంగా చూడాలన్నారు. చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్‌ బందీ అయిందని… ఇక టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని సొంత పార్టీ వారే నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ నాయకుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లపై దృష్టి సారించడంతో పాటు పోలింగ్‌ శాతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు.

భారతదేశ చరిత్రలో ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలుపరిచి రికార్డ్‌ సృష్టించిన పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. మ్యానిఫెస్టోలో లేని అంశాలు కళ్యాణలక్ష్మి, అమ్మవడి, కేసీఆర్‌ కిట్‌, వసతి గృహంలో సన్నబియ్యం అన్నం వంటి విప్లవాత్మక పధకాలు ప్రవేశ పెట్టి అమలు పరిచామన్నారు. మొట్టమొదటి సారిగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. విద్య పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు ఇది ఆసరా అవుతుందన్నారు.