కాంగ్రెస్‌ను బొందపెడితేనే తెలంగాణ వస్తుంది:నాగం
నాగంతో బీజేపీ నేతల భేటీ-పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం
బీజేపీలో చేరను-బీజేపీతో కలిసి పని చేస్తా
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన నాగం
హైదరాబాద్: నవంబర్ 5(జనంసాక్షి)
కాంగ్రెస్‌ను బొందపెడితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని, కాంగ్రెస్‌లో విలీణం చేసే పార్టీలలో చేరనని బీజేపీతో కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నానని ఎన్డీయే తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసన సభ్యుడు నాగం జనార్థన్‌రెడ్డిని భారతీయ జనతా పార్టీ నేతలు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కలుసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలు మధ్యాహ్నం నాగంతో భేటీ అయి ఆయనను పార్టీలోకి ఆహ్వనించారు. అయితే ప్రస్తుతం బీజేపీలో చేరనని కాని ఎన్డీయే తెలంగాణ ఇస్తుందనే నమ్మకం ఉందని బీజేపీతో కలిసి పని చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలిణం చేయడానికి యత్నిస్తున్నారని కాని కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు ప్రధాన శత్రువని అలాంటి పార్టీలో చేరబోనని కాంగ్రెస్ బొందపెడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుందని నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు.
అదేవిధంగా నాగం జనార్థన్ రెడ్డి తో పాటు తెలంగాణ కోసం బయటకు వచ్చిన అదిలాబాద్ జిల్లా ఎమ్మల్యే వేణుగోపాల చారిని కూడా రెండు రోజుల్లో బిజెపి నేతలు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వనించనున్నారు. రాష్ట్రంలో బిజేపీకి ఏమాత్రం పట్టులేదు అయితే తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఆ ప్రాంతంలో పార్టీ క్రమంగా పుంజుకుంటోంది తెలంగాణ అంటే టిఆర్‌ఎన్, అంటే కెసిఆర్ అన్న భావన నుండి ఇటివల క్రమంగా ప్రజలు బయటపడుతున్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న అన్ని పార్టీలకు మద్దతు పలుకుతున్నారు, టిఆర్‌ఎన్ తర్వాత తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీల్లో బిజెపి వైపు ప్రజలు క్రమంగా మొగ్గుచూపుతున్నారు. అయితే తెరాస చీఫ్ కె చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడలపై బిజెపి గుర్రుగా ఉంది దీంతో తెరాసకు దీటుగా బిజెపిని తెలంగాణలో నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ కోసం బిజెపి ఇటీవల తీవ్రంగా ఉద్యమిస్తోంది జెఏసితో కలిసి పని చేస్తోంది ఉద్యమంతో పాటు ఇమేజ్ ఉన్న నేతలను పార్టీలోకి ఇహ్వానించేందుకు సిద్ధపడింది అందులో భాగంగా నాగం, వేణుగోపాల చారికి బిజెపి లోనికి ఆహ్వానించేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారు నాగం తెలంగాణ ఉద్యమంతలో కీలక పాత్ర పోషిస్తూ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.