కాంగ్రెస్ కన్నా ఇండిపెండెంట్‌కే మూడు ఓట్లు ఎక్కువ
హుజూరాబాద్,నవంబర్2జనంసాక్షి : హుజురాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికన్నా ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 119 ఓట్లు రాగా.. ప్రజాపక్త పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థి, రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌కు 122 ఓట్లు వచ్చాయి. డైమండ్ గుర్తుపై పోటీ చేసిన మరో స్వతంత్ర అభ్యర్ధి సాయన్నకు 113 ఓట్లు వచ్చాయి.