కాంగ్రెస్‌ కుండకు పెద్ద చిల్లు

పార్టీ మనుగడకు ఇక కష్టమే
ఆదినుంచీ రేవంత్‌ నాయకత్వంపై అసంతృప్తే
పోయే నేతలను ఆపే శక్తి లేని రేవంత్‌
బిజెపికి కలసి వస్తున్న రేవంత్‌ వ్యవహారం

హైదరాబాద్‌,ఆగగస్ట్‌6( జనం సాక్షి): టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరి ఏకంగా పిసిసి పదవినే పొందిన రేవంత్‌ రెడ్డి తీరుపై కాంగ్రెస్‌లో తిరుగుబాటు మొదలయ్యింది. ముందునుంచీ కాంగ్రెస్‌లో వేళ్లూనుకుని పోయిన కాంగ్రెస్‌ నేతలు ఎవ్వరు కూడా రేవంత్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని ఆయన పదవి పొందిన నాటి నుంచే స్పష్టమయ్యింది. రేవంత్‌ నియామకాన్ని బాహాటంగానే విమర్శించారు. ఏదో సర్దుకుంటుందుని
అనుకుంటున్న సమయంలో అసలుకే ఎసరు వచ్చింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి బాంబులా విస్ఫోటనం చెందుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. రేంవత్‌ రెడ్డి ఒంటెద్దు పోకడలు, అహంకారంపై ఇప్పుడు తిరుగబాటు మొదలయ్యింది. అదే ఇప్పుడు బిజెపిక ఇకలసి వస్తోంది. కాంగ్రెస్‌లో స్వేఛ్చ ఎక్కువ. అయితే విమర్శలు సర్దుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడది కాంగ్రెస్‌ పునాదులనే పెకిలించేలా కనిపిస్తోంది. రెండు రోజుల తేడాలో ఇద్దరు సీనియర్‌ నేతలు బయటకు రావడం చూస్తుంటే కాంగ్రెస్‌ తెలంగాణలో బట్టకట్టడం ఇక కుదరదని అనిపిస్తోంది. ఈ ఇద్దరు మరో ఇరవై మంది అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒక్కసారి చిల్లు పడ్డాకపూడ్చడం కష్టం. ఇప్పటికే జగ్గారెడ్డి బహిరంగ తిరుగుబాటు చేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌ బయటకు వచ్చారు. వారిదారిలోనే వెంకట్‌ రెడ్డి కూడా పోతాడని అంటున్నారు. సీనియర్‌ నేతలు ఎవ్వరు కూడా రేవంత్‌ నాయకత్వంపై పనిచేయడానికి ఇష్టం గానూ,సిద్దంగానూ లేరు. మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గతం కన్నా హీనంగా తయారవు తుందనడంలో సందేహంలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఇక వరుస షాక్‌లు తప్పవని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే , ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు సాక్ష్యం. ఈక్రమంలో జగగ్గారెడ్డి, వెంకట్‌ రెడ్డి సహా మరికొందరు నేతలు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్‌ వెల్లడిరచారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారని శ్రవణ్‌ ప్రకటించినా..గతంలోనే అనేకులు పరోక్షోగా ఈ వ్యాఖ్యలుచేశారు. విహెచ్‌,జానారెడ్డి, ఉత్తమ్కుమార్‌ రెడ్డి,పొన్నాల,శ్రీదర్‌ బాబు,పొన్నం ప్రభాకర్‌ తదతరులు ఎవకవరు కూడా రేవంత్‌ నాయకత్వంలో పనిచేయడానికి సిద్దంగా లేరు. రేవంత్‌రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదన్న విమర్శలు ఒక్క దాసోజు నుంచి వచ్చినవిగా చూడరాదు. ఈ క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం పక్కనపెడితే…కాంగ్రెస్‌లో గట్టిగా నిలబడే నేతలు ఉండకపోవచ్చు. కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి ప్రైవేట్‌ పాపర్టీగా మార్చారన్న ఆరోపణలు ఆయననిరంకుశాన్ని తెలియచేస్తున్నాయి. గత కొంతకాలంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ వైఖరి పట్ల అనేకులుఅసంతృప్తిగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హస్తం పార్టీలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అంటున్నారు. అలాగే కాంగ్రెస్‌ను ఫ్రాంచైజీగా నడుపుతున్నారని మండిపడ్డారు. తనకు తిరుగు లేదన్న రీతిలో రేవంత్‌ వ్యవహార శైలి ఉందన్న విమర్వలు పెరిగాయి. రేవంత్‌ పీసీసీ చీఫ్‌ అయ్యాక కాంగ్రెస్‌లో కులం, ధనం అన్నట్టుగా మారిపోయిందని అన్నారు. రాహుల్‌ ఆలోచనకు వ్యతిరేకంగా రేవంత్‌ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తు న్నాడని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో తన సొంత ముఠాను ప్రోత్స హిస్తున్నరని దాసోజు శ్రవణ్‌ తీవ్రంగా ఆరోపించారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకునేందుకు పార్టీని బలహీన పరుస్తున్నారన్నారు. పార్టీలో ఎవరినీ లెక్కచేయకుండా నిరంకుశంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీ తెచ్చు కున్నట్టు రేవంత్‌ వ్యవహరిస్తున్నరని తెలిపారు. అయితే ఈ విమర్శలు ఒక్క దాసోజువిగానే చూడరాదు. ఇది రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వారి అభిప్రాయాలుగా చూడాలి. కెసిఆర్‌ను తిట్టినట్లుగా రాజగోపాల్‌రెడ్డిని తిట్టడం ద్వారా రేవంత్‌ మరింతగా పలుచనై పోయారు. ఈ
క్రమంలో కాంగ్రెస్‌ తెలంగాణలో మనుగడ సాగించడం కష్టం.

తాజావార్తలు