కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి
– బాబు చెబితే భాజాపాలో చేరా
హైదరాబాద్, ఆగష్టు 31 (జనంసాక్షి):
ఇకపై తమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ గుండెలు అదిరేలా ఉంటాయని,సంగారెడ్డికి రావాలంటే మంత్రులు ఆలోచించుకోవాలని తిరిగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి జగ్గారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. 2019లో సంగారెడ్డి ప్రజలు తిరిగి తనను ఎన్నుకుంటారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను టీఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. కుంతియా, జానారెడ్డి తదితరుల సమక్షంలో మళ్లీ ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే దిగ్విజయ్‌ను కలిసి కాంగ్రెస్‌లో తిరిగి చేరేందకు సముఖుత వ్యక్తం చేశారు. గత మెదక్ ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రాముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మాటలు విని తాను అప్పట్లో భాజాపాలో చేరి తప్పు చేశానని జగ్గారెడ్డి చెప్పుకోచ్చారు.