కాంగ్రెస్ శాసనసభ్యులు అందుబాటులో ఉండాలి
హైదరాబాద్: యూపిఏ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జిని బరిలోకి దింపిన కాంగ్రెస్ దాదా గెలుపు కోసం అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరుతుంది. అయితే సంగ్మా కూడా బరిలో నిలవటంతో ద్విముఖ పోటి నెలకొంది. ఈ నెపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభ్యులు ఓటింగ్‌లో అందరు పాల్గోనాలి పిలుపునిచ్చింది. ఈ నెల 18వ తేది రోజున కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18,19 తేదిలల్లో అందురు శాసన సభ సభ్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేపడుతున్న ఇందిరమ్మబాట కార్యక్రమం ద్వారా ప్రజల కష్ట సుఖలను తెలుసుకునెందుకు సులభతరమవుతుందని ఆయన అన్నారు.