కాంగ్రెస్ నాయకులు ముందస్తు హౌస్ అరెస్ట్,
మండలంలోని మంగళ వారి పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళ వారి పేట గ్రామం లో ఆసరా పింఛన్ కార్డుల పంపకానికి వస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి నర్సంపేట శాసనసభ్యుడు ఇచ్చిన మాటలు మంగళ వారి పేట భూముల గురించి,
ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు 10. లక్షలు ఇస్తానని చెప్పిన మాట ఎమ్మెల్యే ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీ . పోలీసుల చేత హౌస్ అరెస్ట్ చేయించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాల నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.,ఇప్పటికైనా మీ దౌర్జన్యాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
Attachments area