కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరిన పెద్దపల్లి గ్రామ వాల్మీకి బోయ సంఘం వారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరిన పెద్దపల్లి గ్రామ వాల్మీకి బోయ సంఘం వారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 14(జనం సాక్షి )నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఈరోజు తెలకపల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి బోయ సంఘం వారు పెద్దపులి ఈశ్వర్, బాలరాజు,గువ్వల గణేష్,పి. ఉపేంద్ర, మండ్ల బాలకృష్ణ, మాండ్ల విష్ణు, మెనిగా శంకర్,పి.పరమేష్ ,పి. మధు,పి.కృష్ణయ్య,స్వామి,రాములు, వెంకటయ్య, అలివేలు,ఆంజనేయులు వీరితో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరినారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మా గ్రామానికి ఎంతో అభివృధి చేశారు,అని పార్టీలను చూడకుండా సంక్షేమ పథకాలు అందజేశారని,మళ్ళీ ఎమ్మెల్యే గా మర్రి జనార్దన్ రెడ్డి గెలిచి నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని మరియు మా పెద్దపల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరడం జరిగింది అని తెలిపారు , ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిదులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..