కాంగ్రెస్ పార్టీలోకి యువకుల చేరిక
కాంగ్రెస్ పార్టీలోకి యువకుల చేరిక
పిట్లం జూన్8 (జనం సాక్షి )
పిట్లం మండలం లోని చిన్న కొడప్గల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి యువకులు చేరారు. చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన 12 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిమానంతో పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చి దేశ అభివృద్ధికి ఎన్నో సేవలు చేసిన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సేవలను గుర్తించి యువతను మంచి మార్గంలో నిలపడానికి రాహుల్ గాంధీ అధ్యక్షతన యువకులకు ఎంతో మేలు చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి 2024లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి డైరెక్టర్ సాయి రెడ్డి యువకులు పాల్గొన్నారు.