*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలో ప్రెస్ మీట్ *
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 28 :
జనంసాక్షి
మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం ఆధ్వర్యంలో నాయకులు, రైతు నాయకులు, జెట్టి లింగం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఏర్పడిన రోజు నుండి పసుపు రైతులు, వ్యాపారస్తులు తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో రైతులు, వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో లాభాల్లో కొనసాగారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద పసుపు నిలువలు సుమారుగా 35 లక్షల నుండి 40 లక్షల బస్తాలు వరకు నిలువ ఉన్నది. ఈ నిల్వలు రాబోవు 3 నెలల కాలంలో దేశీయంగా కానీ, విదేశీయంగా కానీ నిలువ ఉన్న బస్తాలు ఎగుమతి కాని పక్షంలో పసుపు ధరలు అధిక మొత్తంలో తగ్గిపోయి ప్రమాదం ఉంది. రాబోవు 3 నెలల్లో కొత్త పసుపు పంట మార్కెట్లోకి రానుంది. ఈలోపు నిలువ ఉన్న బస్తాలు ఎగుమతి కాని పక్షంలో పసుపు ధర కనిష్టంగా 3 వేల నుండి 4 వేల రూపాయలకు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అధికారం అనుభవిస్తున్న అరవింద్ ఇకనైనా కళ్ళు తెరిచి పసుపు నిలువ ఉన్న బస్తాలు ఎగుమతి అయ్యేలా చూసి, మద్దతు ధర, పసుపు బోర్డు తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించాలని లేని పక్షంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పల్లెల్లో తిరగనివ్వరని, ఉత్తర తెలంగాణ టీఆరెస్ ఎమ్మెల్యేలు టీఆరెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి టిఆరస్ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేలా చేయాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జెట్టి లింగం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెటుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూమయ్య, ముఖీమ్, జబ్బర్, షకీల్, యూత్ కాంగ్రెస్ నాయకులు కోటగిరి చైతన్య, రమేష్, కరుణాకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.