కాంగ్రెస్, బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రైతు సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ ధర్నా
రైతు సమస్యలు పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు : బిఎల్ఆర్
మిర్యాలగూడ, జనం సాక్షి :
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ,బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ర్యాలీ, ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, రైతులు కాంగ్రెస్ శ్రేణులు ,పెద్ద సంఖ్యలో హాజరైనారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ ఆర్) మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. అధికారం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతు సమస్యలు పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విప్లమైందన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ భూములు 2006లో తెచ్చిన అటవీ భూముల హక్కు చట్టం ప్రకారం అందరికీ భూమి హక్కు కల్పించాలని, కాంగ్రెస్ హయాంలో పేదలకు అసైన్డ్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, పట్టాదారులకు ఉండే హక్కు సమానంగా అసైన్డ్ భూములకు హక్కు కల్పించాలని, ఆ విధంగా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలుపరిష్కరించేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమము ఉధృతం చేస్తామనిఆయనపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి పుట్టల సునీత కృపయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు ఎల్లారెడ్డి కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ కొమ్మన నాగలక్ష్మి మంత్రాల రుణాల్ రెడ్డి క్రికెటర్ జానీ చల్లా నాగలక్ష్మి గుంజ చంద్రకళ పందిరి అనిత రావూరి రవి నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు నరేందర్ ఎంపీటీసీలు బెజ్జం సాయి ఆవుల రజిత దేవేందర్ రెడ్డి ఇజ్రాయిల్ జగ్గారెడ్డి రామలింగయ్య సురేష్ బలరాం ధర్మనాయక్ దామరచర్ల సర్పంచ్ కిరణ్ సర్పంచులు మంగమ్మ సైదులు బొడ్డు మల్లయ్య యాదవ్ కొలసాని పద్మావతి శ్రీనివాస్ వేమారెడ్డి లాలూ నాయక్ మోహన్ రావు మాజీ ఎంపీపీ జిందా యువజన కాంగ్రెస్ నాయకులు అజహార్, సిద్దు నాయక్, ఇమ్రాన్, వేములపల్లి రవీందర్ రెడ్డి, బీసీ సంఘం నాయకులు పోలగాని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.