కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా మాదిరి ఏరియర్స్ ఇవ్వాలి.

– టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 1, (జనంసాక్షి )
సింగరేణిలో కూడా కాంట్రాక్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా ఏరియర్స్ ఇవ్వాలని టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరాం సింగ్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని టీఎన్టీటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు ఏరియర్స్, 35% లాభాల వాటా ఎప్పుడు ఇస్తారని సింగరేణి యజమాన్యాన్ని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదకత పెరిగిందని, ఇతర పన్నుల చెల్లింపు తర్వాత లాభాలను పొందిందన్నారు. సింగరేణిలో 30000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు భూగర్భంలో ఓపెన్ కాస్ట్ లలో పనిచేస్తున్నారని, కాంట్రాక్ట్ కార్మికులు శాశ్వత కార్మికులతో సమానంగా పని ప్రదేశాలలో ఉత్పత్తి తీయడంలో భాగస్వాములు అవుతున్నారన్నారు. సింగరేణి సంస్థ రికార్డ్ స్థాయిలో లాభాలు గడించింది అంటే కాంట్రాక్ట్ కార్మికుల చలవే అన్నారు. సమాన పనికి సమాన వేత నాలు, లాభాల్లో పాలుపంచుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ కార్మికుల తో సమానంగా 35% లాభాల వాటా చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీవనోపాధి పెరగడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జివోలను గెజిట్ చేయాలని, కనీస వేతనం 26000 తగ్గకుండా చెల్లించాలని, 11వ వేతన ఒప్పందం, 23 నెలల ఏరియాస్ సెప్టెంబర్ వేతనలతో పాటు చెల్లించాలని, పదో వేజ్ బోర్డు లోని 20 లక్షల వరకు సవరించిన గ్రాడ్యుటీ బకాయిలను చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, లేనియెడల సింగరేణి కాలర్స్ లేబర్ యూనియన్ టిఎన్టియుసి ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలకు కార్మిక వర్గం అంత సిద్ధంగా ఉండాలని, సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత అన్ని జీఎం ఆఫీసుల ముందు, కార్పొరేట్ ఆఫీస్ ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గద్దల నారాయణ, డి చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి ఓ జీవరత్నం, నాయకులు బొల్లు మల్లయ్య, ఎండి హసన్, జి శేఖర్, ఏ శంకరయ్య, హరి కిషన్ పాండే, ఏ శంకరయ్య, కాసర్ల వెంకటేష్, భగవాన్ సింగ్ పాల్గొన్నారు.

తాజావార్తలు