కాంట్రాక్ట్ కార్మికులు హక్కులకై పోరాటం
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)
మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో
ప్రియా సిమెంట్ కాంట్రాక్ట్ కార్మికులు హక్కులకై జరిగే ఆకలి పోరాటానికి పార్టీలకతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి కోరారు,
రామపురం ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేస్తున్న సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనం కల్పించాలని ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకుండా ఉండటం అన్యాయమని కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు, ఎలక్ట్రిషన్ మెకానికల్ టెక్నికల్ వర్కర్స్ కి రోజుకు 410 రూపాయల నుంచి 475 ఇస్తున్నారని ఈరోజు సుతార్ పని చేసేవారికి రోజుకి 700 రూ,, లు నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నాయని యాజమాన్యం కార్మికులతో తక్కువ వేతనంతో వేట్టిచాకిరి చేపిస్తుందని విమర్శించారు కార్మికులు కుటుంబ సభ్యులతో రేపు కృష్ణ పెట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ (సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో) ఫ్యాక్టరీ ముందు వంట వార్పు జరుగుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ నాయకులు తీగల శ్రీను నాగేశ్వరరావు ఆర్ శీను నాగేశ్వరరావు బి వెంకన్న ఎస్ కే జానీ జానకిరామ్ నాగేశ్వరావు g రామకృష్ణ రామారావు చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు