కాకతీయ ఓపెన్ కాస్టుల్లో చేరిన నీరు
నిలిచిన బొగ్గు ఉత్పత్తితో తీవ్ర నష్టం
జయశంకర్ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి కాకతీయ ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లోకి వరద నీరు వచ్చిచేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థకు ఐదున్నర కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు భూపాలపల్లి మండలంలోని దీక్షకుంట జలదిగ్బంధలో ఉంది.