కాపురాజయ్య పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి
మెదక్: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ వ్యక్తం చేశారు. మంజీరా రచయితల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఆదివారం రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం రాజయ్యపేరిట ఓ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఓ ప్రఖ్యాత చిత్రకారుడికి దానిని ప్రధానం చేయాలని కోరారు. కార్యక్రమంలో నందిని సిద్ధారెడ్డి, దేశ్‌వతి శ్రీనివాస్, సీపీఐ సీనియర్ నేత సిరాజుద్దీన్, చిత్రకారుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.