కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న 2వ వర్ధంతి సభను జయప్రదం చేయండి-సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ

కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న 2వ వర్ధంతి సభను జయప్రదం చేయండి-సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ
బయ్యారం,సెప్టెంబర్20(జనంసాక్షి):
సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యులు ఎస్ కే.ముఖ్తార్ పాషన్న రెండవ వర్ధంతి సభ ఈనెల 24న బయ్యారం క్రీడామైదానంలో జరుగనుంది.ఈ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుతూ గౌరారం లో గ్రూప్ మీటింగ్ జరిపి వర్ధంతి సభ గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు.పార్టీ గ్రామ కార్యదర్శి మందాటీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ బయ్యారం సబ్ డివిజన్ నాయకులు మేకల ఉప్పలయ్య  పాల్గొని మాట్లాడుతూ ముఖ్తార్ పాషన్న ఏజెన్సీ ప్రాంతమయిన గుండాల గ్రామంలో జన్మించారని, చదువుకుంటున్న సమయంలోనే విద్యార్ధి సంఘం పిడిఎస్ యు లో విద్యార్ధి సంఘ నాయకుడిగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉధ్యమాలు చేశారని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాల అమలులో భాగంగా చదువు(డిగ్రీ)ని మధ్యలోనే ఆపేసి కార్మిక రంగంలో,పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా భాధ్యతలు చేపట్టాడన్నారు.ఉమ్మడి వరంగల్,ఖమ్మం జిల్లాలోని పెంకు ఫ్యాక్టరీలలో యూనియన్ స్థాపించి పెంకు కార్మికుల హక్కుల సాదన కోసం అనేక ఉద్యమాలు చేసి వారికి హక్కులను సాధించి పెట్టాడన్నారు.అంతే కాకుండా పార్టీ నాయకుడిగా నిరంతరం ప్రజలకోసం ఆలోచిస్తూ,ప్రజా సమస్యలపై అనేక ఆందోళనలు,ఉద్యమాలు చేశాడని,
 ఎప్పుడూ ప్రజలు,కార్మికుల కోసం అలొచిస్తూ తన జీవితాన్ని  గడిపాడన్నారు.ప్రజాఉద్యమాల లో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి అనేక నిర్భందాలను సైతం ఎదుర్కొని నిలబడ్డ నాయకుడు పాషన్న అంటూ విప్లవజోహార్లు తెలిపారు.తన 40సంవత్సరాల విప్లవకర ఉద్యమ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అంచలంచెలుగా ఎదిగి సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులుగా,భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ)జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడన్నారు. 2020సంవత్సరం ఆగస్టు నెలలో పార్టీ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లినప్పుడు కరోన బారినపడి నెలరోజులకు పైగా కరోనాతో పోరాడి చివరికి 2020 సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచాడని అన్నారు.ముఖ్తార్ పాషన్న మరణం పార్టీకే కాదు యావత్ కార్మిక వర్గానికి,ప్రజలకి తీవ్రమైన నష్టం అని తెలిపారు.
పాషన్న మరణించి ఈనెల 24కి రెండు సంవత్సరాలు అవుతుందని,
   పాషన్న రెండవ వర్ధంతి సభ ఈనెల 24న బయ్యారం లో జరుగుతుందని,ఈ వర్ధంతి సభలో పార్టీ శ్రేణులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల,గ్రామ ప్రజా సంఘాల నాయకులు దుస్సా వీరభద్రం,బుచ్చయ్య,వెంకటాచారి,సత్యనారాయణ,లక్ష్మయ్య,రవి,లింగయ్య,సుమన్,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area