కాయకల్ప అవార్డుకు ఎంపిక అవడం పై సంబంధిత వైద్యాధికారులను అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్ బ్యూరో-జిల్లాజూలై 16..జనంసాక్షి
ఉత్తమ సేవలు అందించినందుకు కాయకల్ప అవార్డుకు ఎంపిక అవడం పై సంబంధిత వైద్యాధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక, డాక్టర్ హరీష్ రాజ్ లు సంయుక్తంగా నేడోక ప్రకటనలో అభినందనలు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్, కాయకల్ప కార్యక్రమం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2021-2022 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 12 ఉత్తమ అస్పత్రులుగా గుర్తించారని, జిల్లాలో ఉత్తమ అస్పత్రులుగా గుర్తించిన 12 మంది వైద్యాధికారులను ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు. జిల్లాలోని ఉత్తమ అస్పత్రులుగా ఏంపిక అయిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం గంగారంకు 2 లక్షల పారితిషికాన్ని ప్రకటించారు. అలాగే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కోమట్లగూడెం -50వేలు, ప్రా. ఆ. కేంద్రం 50 వేలు, ప్రా. ఆ. కేంద్రం డోర్నకల్ -50వేలు, ప్రా. ఆ. కేంద్రం ముల్కనూర్ -50వేలు, ప్రా ఆ. కేంద్రం ఇనుగుర్తి -50వేలు, ప్రా. ఆ. కేంద్రం కేసముద్రం -50వేలు, ప్రా. ఆ. కేంద్రం ఉగ్గంపల్లి -50వేలు, ప్రా. ఆ. కేంద్రం కురవి -50వేలు, ఇంకా మునిగలవీడు హెల్త్ వెల్నెస్ సెంటర్, నెల్లికుదురు ప్రా. ఆ.కేంద్రం -1లక్ష రూపాయలు, జగ్గుతండా, బయ్యారం ప్రా. ఆ. కేంద్రం -50వేలు, కందికొండ హెల్త్ వెల్నెస్ సెంటర్, కురవి ప్రా. ఆ. కేంద్రం కు -35 వేల పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని జిల్లా వైద్య, అరోగ్య శాఖధికారి డాక్టర్ బి. హరీష్ రాజ్ తెలిపారు. జిల్లాలో 12 అస్పత్రులు ఎంపిక కావడం చాలా ఆనందంగా వున్నదని, అలాగే రాబోవు రోజులలో అస్పత్రులలో మరిన్ని మెరుగైన వసతులు కల్పించి ఇంకా ఇలాంటి బహుమతులు / పారితోషికాలు మరెన్నో వచ్చేలా వైద్యాధికారులు మరింత శ్రద్ద తీసుకొని జిల్లాను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్, డి.ఎం.అండ్. హెచ్. ఓ లు కోరారు