కారెం వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టరేట్‌ ముట్టడి

కలెక్టరేట్‌: అట్టడుగున జీవిస్తున్న దళిత ఉపకులాలను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెబుతామని తెలంగాణ ఎస్సీ ఉప కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లిఖార్జున్‌ హెచ్చరించారు. బుధవారం నగరంలోని సంఘం భవనంలో ఎస్సీ ఉప కులాల అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోక దుర్భర జీవితం అనుభవిస్తున్న ఉప కులాలను మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ కించపరిచినట్లు మాట్లాడం అప్రజాస్వామికమన్నారు. ఎస్సీ నకిలీ ధ్రువ పత్రాలు తీసుకుంటున్నారని శివాజీ మాట్లాడటం అవగాహన రాహిత్యమని ఆరోపించారు. వివిధ సంఘాల నేతల తడగొండ సత్యరాజ్‌వర్మ, ఎడపల్లి భూమేశ్‌, సమ్మయ్య, గంగాధర కుబమార్‌, మోటం రాంబాబు, మల్లేశం, కళ్యాణ్‌ శ్రీనివాస్‌, తిరుమలయ్య, సంపత్‌కుమార్‌, నర్సయ్య, రాజేశ్‌ పాల్గొన్నారు.