కారెక్కిన అజ్మీరా రేఖా శ్యాంనాయక్
ఖానాపూర్ రూరల్, జనంసాక్షి: కాంగ్రెస్ నాయకురాలు, ఖానాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అజ్మీరా రేఖా శ్యాంనాయక్ సోమవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ముందుగా ఖానాపూర్‌లోని విద్యానగర్ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అరవింద్‌రెడ్డి, నల్లాల ఓదెలు, జోగు రామన్న, పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, రాష్ట్ర నాయకులు అజ్మీరా గోవింద్ నాయక్, టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహంచారు. అక్కడ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలు వేసి జైతెలంగాణ నినాదాలతో ఎమ్మెల్యేలు గులాబీ దండును హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రేఖాశ్యాంనాయక్‌ను అభినందించారు. అయితే తాను ఎలాంటి పదవులూ ఆశించకుండా కేవలం ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రేఖా శ్యాంనాయక్ స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు ఖానాపూర్ , కడెం, జన్నారం, ఇంద్ర ఉట్నూర్ మండలాలను నుంచి 340 వాహనాల్లో సుమారు నాలుగు వేల మంది కార్యకర్తలు తరిలి ఈ కార్యక్షికమంలో తలమడుగు మాజీ జడ్పీటీసీ బాబన్న, స్థానిక నాయకులు తోట సత్యం, పుష్పల శంకర్ , డి. మల్లయ్య, సత్యనారాయణ, పుష్పాల గజేందర్, సత్యవతి, నంద కుమార్, సతీశ్, రేఖాశ్యాంనాయక్ అనుచరులు, తదితరులు ఉన్నారు.
రేఖకు నియోజకవర్గ పగ్గాలు
టీఆర్‌ఎస్‌లో చేరిన అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌కు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు. విద్యావంతురాలైన రేఖాశ్యాంనాయక్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని రాజకీయ సమీకరణలు మారనున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.