కారేపల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

భక్తి శ్రద్దలతో నాగులచవితి

కారేపల్లి: నాగులచవితిని ఆదివారం మండలంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునే భక్తులు పుట్టల వద్దకు చేరుకోని పుట్టకు నీళ్లు పోసి, పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పుట్ట వద్ద పాలు, పండ్లు, గ్రుడ్లు నైవేధ్యంగా సమర్పించారు. కొందరు పుట్టవద్దనే మొక్కులు తీర్చుకున్నారు. చిన్న పిల్లలకు చెవులు, ముక్కుల కుట్టించటం వంటివి నిర్వహించారు. నాగుల చవితికి ఉండే వారు ఉపవాసం దీక్షా చేసి సోమవారం తెల్లవారుజామున సద్ది పాలు పుట్టలో పోసి పలహారాల పంపిణి అనంతరం ఉపవాస దీక్షను విడుస్తారు. కారేపల్లిలోని పూరాతన దేవాలయం అయిన పెద్దమ్మతల్లి ఆలయంలోని నాగేంద్రస్వామి విగ్రహం వద్ద భక్తులు ప్రదక్షణలతో కిటకిటలాడింది.