కార్తీక చివరి సోమవారం
గద్వాల,నవంబరు 25 (జనంసాక్షి) : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలకు భకత్లు రాక పెరిగింది. వేకవ జామునే ఆలయాల్లో పూజలు చేపట్టారు. వత్తులతో దీపాలు వెలిగించారు. జోగుళాంబదేవి,
బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలలో సోమవారం కార్తీక శోభతో కళకళలాడింది. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానమాచరించి స్వామి వారి ఆలయంలో, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక చివరి సోమవారం కావటంతో మహిళలు అధికంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో చివరి వారంతోభక్తులతో ఉభయ ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం తెల్లవారుజామున తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తుంగభద్ర నదికి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. తుంగబ్ర నదిలో భక్తులు పుట్టిలలో విహార యాత్ర చేశారు.వివిధ దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలోకుంకుమార్చన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో గంటపాటు వేచి ఉండాల్సి వచ్చింది. తుంగభద్రనదిలో స్నానపు ఘట్టాలు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టాలని భక్తులు కోరుతున్నారు.



