కార్పొరేట్లకు చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

arun

గురుగ్రామ్, నవంబర్ 5: కార్పొరేట్లకు చేయూతనివ్వాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. విదేశీ పెట్టుబడులు దేశంలోకి ధారాళంగా వస్తున్నందున ప్రైవేట్‌రంగ పెట్టుబడులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ రంగానికి తగినంత సాయం రుణాల రూపంలో బ్యాంకులు అందించాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోకి పెట్టుబడులు వస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని, అందుకు బ్యాంకుల పాత్ర ప్రధానమని అన్నారు. శనివారం ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డెట్ రికవరీపై నిర్వహించిన సదస్సులో జైట్లీ మాట్లాడుతూ ‘పెట్టుబడుల విస్తరణలో ప్రైవేట్ రంగానికి కావాల్సిన మద్దతు బ్యాంకుల ద్వారా అందాలి. వృద్ధిరేటు బలోపేతం కావడానికి బ్యాంకుల పాత్ర కీలకం. కానీ అలా జరగడం లేదు.’ అన్నారు. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదన్న జైట్లీ మొండి బకాయిల సమస్యను ప్రస్తావించారు. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో గత కొనే్నళ్లుగా రుణాల మంజూరు మందగించిందన్నారు. పెరుగుతున్న మొండి బకాయిలు, బకాయిల వసూళ్లు మందకొడిగా సాగడంతో బ్యాంకులు రుణాల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించడం ప్రారంభించాయని చెప్పారు. అయితే బ్యాంకుల మొండి బకాయిల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఇందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. ఎప్పటికీ ఏదో ఒక అవకాశం ఉందనుకోవద్దని, పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవంటూ డిఫాల్టర్లను జైట్లీ హెచ్చరించడం గమనార్హం. కార్పొరేట్లు సైతం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆర్థిక సమస్యలుండవని గుర్తుచేసిన జైట్లీ.. బ్యాంకులు కూడా అందరినీ ఒకే దృష్టితో చూడరాదని హితవు పలికారు. ఇక దేశవ్యాప్తంగా డెట్ రికవరీ ట్రిబ్యునళ్ల వద్ద దాదాపు 95 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసులకు 5 లక్షల కోట్ల రూపాయలకుపైగా రుణాలతో సంబంధాలున్నాయని చెప్పారు. కాబట్టి ప్రతి కేసు నూతన పెట్టుబడులకు విఘాతం కలిగించేదిగానే పేర్కొన్న ఆయన ఇంత పెద్దమొత్తంలో బ్యాంకుల నిధులు స్తంభించిపోయాయని, డిఫాల్టర్ల చేతిలో ఇరుక్కుపోయాయని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీటిని త్వరితగతిన వసూలు చేసే మార్గాలపై దృష్టి సారించాలన్న జైట్లీ.. అందుకు కఠిన వైఖరిని ప్రదర్శించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే విదేశీ పెట్టుబడులకు భారత్ అత్యంత అనువైనదిగా ఉండేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానాలను సరళతరం చేస్తున్నామని జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పెట్టిన పెట్టుబడులకు విదేశీ మదుపరులు అధిక మొత్తంలో లాభాలను అందుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమన్న ఆయన దేశీయ ప్రైవేట్‌రంగ పెట్టుబడులు తక్కువగా ఉంటున్నాయని, వీటిని పెంచడం ఓ సవాల్‌గా మారిందన్నారు.

చిత్రం.. డెట్ రికవరీపై సదస్సులో మాట్లాడుతున్న జైట్లీ