కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగింపు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎన్ .మల్లేశం.
వికారాబాద్ జనం సాక్షి జూలై 21:
2022 – 2023 విద్యా సంవత్సరమునకు గాను ఇంటర్మీడియట్ లో ఉచిత విద్యనభ్యసించుట కొరకు కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి ఎస్.సి. ఎస్.టి, బి.సి, మరియు మైనారిటీ విద్యార్థులు అంతర్జాలం ద్వారా https://telanganaepass.cgg. gov.in ఈ నెల 26 వరకు గడువు పొడిగించనైనదని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత దృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎన్ .మల్లేశం తెలియజేసినారు. ఇట్టి అవకాశం మే 2022 పదవ తరగతిలో ఉత్తీర్ణులు అయి GPA 7.0 ఆ పైన సాధించిన విద్యార్థులకు మాత్రమే అర్హత, ఇట్టి కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు, మరియు కస్తుర్బా పాఠశాలలో చదివిన విద్యార్థులు అర్హులు. కావున విద్యార్ధిని / విద్యార్థులు పైన తెలిపిన ప్రకారము ఆన్ లైన్ రిజిస్త్రేషన్ ద్వారా వారి వారి పేర్లు తక్షణమే నమోదు చేసుకోగలరని అన్నారు.
Attachments area