కార్పొరేట్ కు దీటుగా ‘ఇగ్నైటెడ్ మైండ్స్’   * నూతన విద్యా బోధనా ప్రమాణాలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యం  * నాణ్యమైన విద్యను అందించాలి…పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచాలి    : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  

మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ పట్టణంలో అశోక్ నగర్ లోని ఇగ్నైటెడ్ మైండ్స్ ద స్కూల్  కార్పొరేట్ పాఠశాలలకు  దీటుగా నాణ్యమైన విద్యా బోధనా ప్రమాణాలను అందించగలదని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా  మారుతున్న కాలానుగుణంగా నూతన విద్యా బోధనా విధానాలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సర్వ హంగులతో నిర్మించిన ఇగ్నైటెడ్ మైండ్స్ ద  స్కూల్ క్యాంపస్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా స్కూల్ క్యాంపస్ ఏర్పాటు చేసిన యాజమాన్యం అభినందనీయమని అన్నారు. నిరుపేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యాబోధన అందించాలని కోరారు. అర్హత, అనుభవం, అంకిత భావం కలిగిన టీచర్లు ఈ సంస్థలో పని చేస్తున్నారని అన్నారు. చిన్నారుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు చిన్నతనం నుంచే అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విధంగా తీర్చిదిద్దాలని భాస్కర్ రావు కోరారు. విద్యతో పాటు మానసిక వికాసం, శారీరక దారుడ్యం, క్రీడోల్లాసం, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి సమగ్ర అంశాల  మేళవింపుతో విద్యార్థులకు
స్కూల్ టీచర్లు అత్యుత్తమ విద్యాబోధన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎండీ రియాజుద్దీన్, షేక్ అహ్మద్, ఎస్. శ్రీనివాస్, నిస్సార్, జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్, ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ &హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్, కౌన్సిలర్ ఇలియాజ్, ట్రస్మా జిల్లా సెక్రెటరీ గాదె రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీపతి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, జయరాజన్, భీమ్లా నాయక్, ప్రవీణ్, సూర్యనారాయణ, మాహిన్ కౌసర్,వరలక్ష్మీ, ఇంఛార్జీ జానీబేగం, సిబ్బంది శ్వేత, స్వప్న, నిషాద్, నాగేందర్, స్వాతి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.
Attachments area