కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ, గురుకులాలలో నాణ్యమైన విద్య
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, జనం సాక్షి :
కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ గురుకులాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ1,20 ఖర్చు చేస్తూ వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, గురుకులాల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. గురుకులాల విద్యార్థులు రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలకు చేరుకొని పాఠశాలలకు పేరు తీసుకురావాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో 8 గురుకులాల పాఠశాలలు ఉన్నాయని ఏ సమస్య ఉన్న తన దృష్టి తీసుకొని వస్తే వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు (విష్ణు) జడ్పి కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మైనార్టీ గురుకులాల ప్రిన్సిపాల్ అరుణ కుమారి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు ఇలియాస్ ఖాన్, రమేష్, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ఫహీముద్దీన్, టిఆర్ఎస్ బీసీ సంఘం నాయకులు బాసాని గిరి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.