కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్య..

-ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి  సి ఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద..
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, జూన్ 15(జనం సాక్షి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్న ట్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నరేందర్ అన్నారు
కరీమాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనబస్తి మన బడి కార్యక్రమంలో బాగంగా బుధవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు..పాఠశాలలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు..పాఠశాలలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు..
ఈ ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్  రూపొందించారన్నారు..కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పిస్తున్నామని,ఇంగ్లీష్ మీడియం బోదన తో పేద పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్య అందుతుందన్నారు..సర్కారు బడుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక నిదులు కేటాయించిందన్నారు..పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే ముఖ్యమంత్రి కే.సీ.ఆర్  సంకల్పమని,అందులో బాగంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసారన్నారు..
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మరుపల్లి రవి, హెడ్ మాస్టర్ విజయ్ కుమార్ , మోడల్ ఆఫీసర్ నరసింహారావు, కోఆర్డినేటర్ సుభాస్, ఎం ఈ ఓ విజయ్ కుమార్ ,ఎస్ఎంసి చైర్మన్ అత్తర్, ఉపాధ్యాయులు,  విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.