కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం రోజున కోటగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ఏఐటీయూసీ యునియన్ ఆధ్వర్యంలో కోటగిరి బస్టాండ్ ఆవరణలో భారీ ఎత్తున టపాకాయలు పేల్చి,మండల భవ నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పెద్ద నాగిరెడ్డి చేతుల మీదుగా ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఏఐటీయూసీ జిల్లా నాయకులు విట్టల్ గౌడ్ మాట్లాడుతూ భారత దేశంలో 1920 అక్టోబర్ 31వ తేదీన బొంబాయిలో ఏఐటీయూసీ యూని యన్ స్థాపించడం జరిగిందన్నారు.భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో ఏఐటీయూసీ యూనియన్ నాయకులు,కార్యకర్త లు ఉద్యమాలు చేశారన్నారు.దేశ కార్మికులకు పని గంటలు,పని గ్యారంటీ,కనీస వేతనాలు అదేవిధం గా పీఎఫ్, ఈఎస్ఐ,బోనస్ లాంటి చట్టాలను ఏఐటీయూసీ యూనియన్ పోరాటాల ద్వారా సాధించుకోవడం జరిగిందన్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆ చట్టాలను రద్దుచేసి యజమానుకులకు అనుకూలంగా చట్టాలు చేస్తూ,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి కమిషన్ల కోసం పని చేస్తున్నా రని తీవ్ర స్థాయిలో వారు మండిపడ్డారు.రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గత చట్టాల్ని సాధించుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకులు నల్ల గంగాధ ర్,బుడాల రాములు,మహమ్మద్ అలీ,అన్వర్, బాలయ్య,ప్లంబర్ నాయకులు మతిన్,హైమద్, ప్రింటర్స్ యూనియన్ నాయకులు అన్వర్,జావిద్ భాష ఎలక్ట్రికల్ నాయకులు మహ్మద్ అలీ, ఇమ్రాన్,తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు శివ,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.