కార్మికుల సమస్యలపై పోరాడేది సీఐటీయు

జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17 , ( జనం సాక్షి ) :
కార్మికుల సమస్యలపై,హక్కులపై పోరాడే ఏకైక సంఘం సీఐటీయు మాత్రమేని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి రాపర్తి రాజు అన్నారు.చిల్పూర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో సిఐటియు  మండలమహాసభ వెంకటాద్రి పేట ఎంపీటీసీ ఎన్న కూస కుమార్ అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథి గా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ మండలంలో ఉద్యోగ, కార్మికుల సమస్యల పై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూఅండగా నిలబడుతున్నకార్మికోద్యమా ల రథసారథి సిఐటియు మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్, భవననిర్మాణం, హమాలి, రంగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, మండలవ్యాప్తంగా గ్రామపంచాయతీ,అంగన్వాడి, ఆశ ,మధ్యాహ్నం భోజనం, వీఆర్ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కనీస వేతనాలు అమలు చేయాలని సమానపనికిసమా నవేతనం ఇవ్వాలని పోరాటాలునిర్వహించామని అన్నారు. దేశంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభు త్వాలు ఎలాంటి చట్టాలు తీసుకురావడం లేదని, కార్మికులకు అనుకూలంగాఉన్న చట్టాలను కూడా తీసివేయాలని కుట్రలుపన్నుతున్నారని అన్నారు. వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులందరూ ఏక తాటిపై ఉండి ఉద్యమించాలని అలాంటప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తప్పనిసరిగా తీసుకో వాలని అన్నారు.కార్మికులకు అండగా సిఐటియు ఉంటుందని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ ఎన్నకూస కుమార్,సిఐటియుజిల్లా ఉపాధ్యక్షుడు సుంచు విజేందర్,గొర్ల మేకల సంఘంనాయకుడు రమేష్,కల్లుగీత కార్మికసంఘం నాయకుడు రాజేం దర్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు కన్నె బోయిన రవి,నాయకులు అపరాధపు రాజు,ఆంజ నేయులు, మొగిలి, రాజు, రాజిరెడ్డి, కిష్టయ్య, కన కయ్య,రవి,రాజు,బిక్షపతి,సదానందం,సాంబరాజు, రాజేందర్, వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.