కార్మిక ద్రోహులకు ఓటు అడిగే హక్కు లేదు

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) :
ఒకరు సింగరేణి యాజమాన్యంతో, మరొకరు రా ష్ట్ర ప్రభుత్వంతో మిలాఖత్‌ అయి సింగరేణి గని కార్మికులను వంచించి సమ్మె ద్వార సాధించు కోవాల్సిన రూ. 800 కోట్ల లాభాలను కార్మికుల కు అందకుండ చేసిన టీబీజీకేఎస్‌్‌, ఐఎన్‌టీయూ సీలకు 28న జరిగే గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ విమ ర్శించారు. శనివారం స్థానిక కొమురయ్య భవన ్‌లో జరిగిన కేటికే 2,6 వ గనుల ముఖ్య కార్య కర్తల సమావేంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జూన్‌ 2011 లో సింగరేణిలో ఆవి ష్కృతంగా ఉన్న 47 డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా యాజ మాన్యం స్పందించని నేపథ్యంలో తప్పని సరై సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేస్తుండగా మొదటి రోజు సమ్మె విజయవంతం కావడంతో బెంబ ేలెత్తిన యాజమాన్యం ఏఐటీయూసీ కోర్కెలు తీర్చా లంటే రూ. 800 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటు ందని పెద్దపెద్ద పోస్టర్లు వేసిందని అయినా కార్మి కులు 2వ రోజు సమ్మెను విజయవంతం చేయడం తో యాజమాన్యం కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత ్తగూడెంలో ఐఎనటీయూసీి, టీబీజీకేఎస్‌ నాయ కు లను పిలిపించి లోపాయికారి ఒప్పందంతో సమ్మె ను విచ్చిన్నం చేయాలని కోరగా తమ కోర్కె లను యాజమాన్యం తీర్చుతాననడంతో ఐఎన్‌ట ియుసి, టిబిజికెఎస్‌ నాయకులు తమ కేడర్‌ను గనులలోకి దింపి సమ్మెను విచ్చిన్నం చేశారని అన్నారు. సమ్మె విఫలం కావడంతో కార్మికులకు రావాల్సిన రూ. 800 కోట్లు రాకుండా చేసి కార్మిక ద్రోహులుగా మిగిలిన ఐఎన్‌టియుసి, టిబిజికెఎస్‌ నాయకులకు కార్మికులను ఓటడిగే హక్కు లేదని ఆయన విమ ర్శించారు. ఈ సమా వేశంలో బ్రాంచి సహాయ కార్యదర్శి అంజయ్య, ఉపాధ్యక్షులు ఏడుకొండలు, బ్రాంచి నాయకులు పుల్లయ్య, సుధాకర్‌రెడ్డి, చంద్రమౌళి, విజేందర్‌, రాజ్‌కుమార్‌, శంకర్‌, సత్యనారాయణ, తిరుపతిరావు, రవి, శ్రీనివాస్‌, రమేష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు