కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలి

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్‌దేశాయి కోరారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందని చెప్పారు. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడు తోందని అన్నారు. రైతులు, కార్మికులు, సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిందని తెలిపారు. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. వారికి అనుకూలమైన చట్టాలు తయారు చేస్తూ ఉద్యోగులు, కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న చట్టాలను సవరించి కార్మిక హక్కులను కాలరాస్తోందని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్గాలని వెతకడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలను దారి మళ్లించడానికి మతం పేరుతో విభజిస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.