కార్మిక సంక్షేమాన్ని విస్మరించారు

గుంటూరు,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  కార్మికుల హక్కులపై ప్రభుత్వాలకు శ్రద్ద లేదని  సిఐటియు జిల్లా నాయకులు అన్నారు. కార్మిక సంఘాల పోరాటం ఫలితంగా వారి కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు. అనేక ఫ్యాక్టరీల్లో ఇప్పటికీ రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేయిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు.  కనీస సౌకర్యాల కల్పనకు  అన్ని కార్మిక సంఘాలూ ఐక్యంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. కార్మికులను దోచుకోవడమే పనిగా  సంస్థలు పనిచేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని తెలిపారు. అణచివేతలు, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. హక్కులను కాపాడుకునేందుకు
ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.