కార్మిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
హైదరాబాద్ : రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కార్మికసంఘాలు విమర్శించాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రామిక జనగర్జన పేరుతో ఇందిరాపార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో సామాజిక, ఉపాధి భద్రతలు లేకోవడంతో దుర్భర జీవితం గడుపుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేసి ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర కార్మికులకు మాదిరిగానే అసంఘటిత కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు.