కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ

ఇఫ్కో జాతీయ డైరెక్టర్ యం. దేవేందర్ రెడ్డి

జనం సాక్షి ప్రతినిధి మెదక్
పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ ఇఫ్కో జాతీయ డైరెక్టర్ యం. దేవేందర్ రెడ్డి గారు అన్నారు. ఇటీవల రామాయంపేట మండలంలో ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన కలవాలా ఎల్లం మరియు నిజాంపేట మండలం జడ్ చెరువు తండాకు చెందిన రామావత్ లక్ష్మణ్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించడం జరిగింది,అలాగే హవెళి ఘనపూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పసుపునూరి దేవమ్మ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరికి టీఆర్ఎస్ ప్రమాద బీమా సభ్యత్వం పొందడంతో బీమా పథకం కింద మంజూరైన ముగ్గురు లబ్ధిదారులకు 2 లక్షల చొప్పున రూ.6,00,000/- మూడు చెక్కులను మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇఫ్కో యం.దేవేందర్ రెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, కిషోర్, గంగాపూర్ సర్పంచ్ పద్మ వెంకట్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్,నాయకులు రాగి అశోక్,లింగారెడ్డి, సాయిరాం, మధు, ఉమర్, ఝాన్సీలింగాపూర్ మాజీ సర్పంచ్ రామ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.