*కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటాం*.

*కార్యకర్తల కుటుంబాలకు  అండగా టి ఆర్ ఎస్ పార్టీ*
*అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం*
*అలంపూర్ జనంసాక్షి* (సెప్టెంబర్ 28) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.
అలంపూర్ మున్సిపల్టీ కి చెందిన రామకృష్ణ  గత సంవత్సరం 2021అక్టోబర్ నెలలో ఉట్కూర్ గ్రామంలో  సెంట్రింగ్ పనులు చేసే క్రమంలో కరెంట్ షాక్ కు గురి అయి మరణించడం  జరిగింది. ఆరోజు బాధిత కుటుంబానీ పరామర్శించడానికి వెళ్లిన  అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం గారు పార్టీ సభ్యత్వం ఉన్నందున రెండు లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికీ అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన ఇంటికి వెళ్ళి రామకృష్ణ  భార్యకు 2 లక్షల రూపాయలచెక్కును నేరుగా లబ్దిదారురాలు కి అందజేశారు.ఈ సదర్భంగా ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని  పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నట్లు అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం   తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు  పార్టీ అధ్యక్షులు ,  సీఎం కేసీఆర్ ,పార్టీ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ , పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ భీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి ₹2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే  వెంట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.మనోరమ ,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య సెట్టి ,మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్ ,మండల ఉప అధ్యక్షడు నర్శన్ గౌడ్ , కౌన్సిలర్లు లక్ష్మి దేవామ్మ ,పెద్ద ముక్తార్ ,కో ఆప్షన్ మెంబర్ అల్ల భాకాస్ ,బతుకాయ్యా ,మాజీ టెంపుల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ,సారయి నాగరాజు ,వెంకటస్వామి ,చిన్న కృష్ణ ,దండోరా మద్దిలేటి ,వలి,దేవరాజు , జాను ,శ్రీనివాసులు ,శేకర్  ఫాయజు ,రాజేష్ ,రాముడు,రహమత్ ,బిచల్లు , మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..
Attachments area