” కార్యకర్తల సంక్షేమమే బిజెపి అంతిమ లక్ష్యం – భాజపానేత గజ్జల యోగానంద్”

 

శేరిలింగంప‌ల్లి, 18( జనంసాక్షి): స్వార్థ రాజకీయాలు రాజ్యమేలుతున్న ఈతరుణంలో కార్యకర్తలను స్వార్థం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వినియోగించుకుంటూ అవసరం తీరిపోగానే కనీసం అటువైపు కన్నెత్తిచూడని దారుణమైన పరిస్థితులు నెలకొంటుండడం ఆందోళనను కలిగిస్తుందని, ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలికి కార్యకర్తలే మూల స్తంభాలుగా ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ బిజెపి అని భాజపా సీనియర్ నేత, శేర్లింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ అన్నారు. ఈమేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధి ప్రగతి నగర్ లోని బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శైలజ వెంకట్రావు ఇంటికి మంగళవారం గజ్జల పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా శైలజ వెంకట్రావు ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ క్యాడర్ లేనిదే లీడర్ లేడని, కార్యకర్తలను విస్మరిస్తే ఏ పార్టీకి పుట్టగతులు ఉండవని గజ్జల పునరుద్ఘాటించారు. అవకాశవాద రాజకీయాన్ని పెంచి పోషిస్తున్న తెరాస, కాంగ్రెస్, ఇతర మతతత్వ శక్తులు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోయి భాజపా మనుగడకు మరింత మార్గం సుగమమవుతుందని, అందుకే ప్రతి తెలంగాణ బిడ్డ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటించాలని యోగానంద్ పిలుపునిచ్చారు. శైలజ వెంకట్రావు లాంటి క్రియాశీల కార్యకర్త బిజెపికి గొప్ప బలమని, ఇలాంటి మహిళా కార్యకర్తలే భవిష్యత్తులో రాజకీయంగా చక్రం తిప్పగలరని గజ్జల ధీమాను వ్యక్తంచేశారు.
Attachments area