కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.
: పరామర్శిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, సెప్టెంబర్27,(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టీఆరెస్ కార్యకర్త ఏగోళపు ప్రకాష్ గౌడ్ అనే కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈవిషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం గొల్లపల్లి గ్రామానికి వెళ్లి ప్రకాష్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యకర్త చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. ఆయన వెంట టీఆరెస్ నాయకులు గడ్డం భీమా గౌడ్, పంజాల విద్యా సాగర్ గౌడ్, గడ్డం అశోక్ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు ఉన్నారు.