కాలభైరవ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించాలి

కాలభైరవ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని  ఆలయ కార్యనిర్వాహక అధికారి ప్రభు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనెల తేదీ 13-11-2022 నుండి  17-117-222 వరకు ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ కమిటీ  సిద్దంగా  ఉందన్నారు.  భక్తులు, దాతల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామి  ఉత్సవా లను ఉత్సాహంగా నిర్వహించ తలపెట్టామని చెప్పారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, కాలభైరవ జన్మదిన వేడుకలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలుకాగ లరని అన్నారు. భక్తులు, అందరూ సహరించాల న్నారు. దయచేసి దేవుని దగ్గర రాజకీయాలు చేయవవద్దన్నారు. భక్తిని మాత్రమే చాటలన్నారు. కాలభైరవుడి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలల చాటాలన్నారు. భక్తులకు ఎలాంటి లోటు పాట్లు ఏర్పడకుండ అన్ని వసతులు కల్పింస్తామన్నారు. విద్యుత్ అధికారులు ఉత్సవాల్లో తమ పాత్రను  పోషించా లన్నారు. పోలీస్ బందోబస్తు ఉంటుం దన్నారు.  ధర్మకర్తల  మండలి సభ్యులు మాట్లాడుతూ,  ఉత్సవాలను అధికారికంగా జరుపుకుంటు న్నామని చెప్పారు. ఇందులో అందిరి సహయ సహకారాలు  అందించాలన్నారు. అనంతరం గోడ ప్రతులు , పత్రికలను ఆవిష్కరిం చారు.  ఈ కార్యక్రమంలో  రామారెడ్డి, ఇసన్నపల్లి సర్పంచ్ లు , ఎంపీ టీసీలు,  ఆలయ సిబ్బంది , ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు